యావర్ రోడ్డు దశ తిరిగేనా..  గతంలో రోడ్డు విస్తరణపై బీఆర్ఎస్ సర్కార్ హామీ

యావర్ రోడ్డు దశ తిరిగేనా..  గతంలో రోడ్డు విస్తరణపై బీఆర్ఎస్ సర్కార్ హామీ
  •  పరిహారం అందించలేక చేతులెత్తేసిన వైనం 
  •  పదేళ్లలో సర్వేలతో కాలయాపన 
  •   ఇరుకు రోడ్డుతో అవస్థలు పడుతున్న జిల్లావాసులు 
  •  కొత్త సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జగిత్యాలవాసుల ఆశలు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరణ కాగితాలకే పరిమితమైంది. రోడ్డు విస్తరణపై ఇచ్చిన హామీని బీఆర్ఎస్​ సర్కార్​పట్టించుకోలేదు. పదేండ్లలో సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. తీరా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోడ్డుకు ఇరువైపులా నష్టపోతున్న బాధితుల వివరాలు సేకరించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కల ప్రకారం రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు పరిహారం చెల్లించాలని ఆఫీసర్లు అంచనా వేశారు. దశాబ్దాలుగా రోడ్డు విస్తరణపై ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– ధర్మపురి మార్గంలో ప్రధాన రోడ్డు కావడంతో జనానికి తిప్పలు తప్పడం లేదు. కొత్త సర్కార్ ఏర్పడటంతో తమ సమస్య తీరుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

ఎన్నికలొచ్చిన ప్రతీసారి ప్రచార అస్ర్తమే

జగిత్యాలలోని యావర్ రోడ్డు కొన్నేండ్లుగా రాజకీయ హామీగా మారింది.  ఏ ఎన్నికలొచ్చినా ఈ రోడ్డు ప్రచార అస్ర్తంగా తయారైంది. ప్రస్తుతం 40, 60, 80 ఫీట్లు ఉండగా దీనిపై ట్రాఫిక్ తో పాటు యాక్సిడెంట్లు కూడా పెరుగుతున్నాయి. 100 ఫీట్లకు రోడ్డును విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్​ పాలనలో కేవలం ప్రభుత్వ ఆఫీసుల వద్ద రోడ్డును విస్తరించారు. ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్డు విసర్తణలో నష్టపోతున్న బాధితులకు పరిహారం కింద టీడీఆర్ అందించేందుకు సర్వే చేపట్టారు. దీనిపై ప్రకారం విస్తరణలో 20 గజాల స్థలం కోల్పోయే బాధితులకు 60 నుంచి 80 గజాల టీడీఆర్( ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫరబుల్​డెవలప్మెంట్ రైట్స్) జారీ చేసేలా జీవో కూడా తీసుకువచ్చారు. ఈ బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఎలక్షన్స్ రావడంతో పనులన్నీ నిలిచిపోయాయి. 

బాధితులకు రూ. 150 కోట్లకు పైగా పరిహారం

యావర్ రోడ్డు విస్తరణలో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దాదాపు 370 పైగా ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో కుడివైపు 178, ఎడమ వైపు 192 బిల్డింగ్స్​ కూల్చాల్సి ఉందని తేల్చారు. ఈ మేరకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా.. ఫండ్స్ కేటాయింపులు జరగకపోవడంతో ఆఫీసర్లు టీడీఆర్ ప్రపోజల్స్ తీసుకువచ్చారు. ఈ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బాధితులు ఆసక్తి చూపకపోవడంతో పనులు నిలిచిపోయాయి.