మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ​కృషి : చల్మెడ లక్ష్మీనరసింహారావు

మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ​కృషి : చల్మెడ లక్ష్మీనరసింహారావు

వేములవాడ, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ముస్లిం మైనార్టీలు అంటే ఎనలేని ప్రేమని, వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శనివారం వేములవాడలో ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ముస్లిం కమిటీ పట్టణ అధ్యక్షుడు అక్రమ్‌‌‌‌తోపాటు మరికొంత మంది యువకులు బీఆర్ఎస్‌‌‌‌లో చేరగా వారికి చల్మెడ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో లీడర్లు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, శ్రీనివాస రావు, విజయ్​, గూడురి మధు, కుమార్, అజయ్​ తదితరులు పాల్గొన్నారు.