కేటీఆర్‌‌‌‌ ఎంత దోచుకున్నడో నిరూపిస్తా కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం

కేటీఆర్‌‌‌‌ ఎంత దోచుకున్నడో నిరూపిస్తా కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: గడిచిన పదేండ్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ ఎంత దోచుకున్నారో తమ దగ్గర ఆధారాలున్నాయని, నిరూపిస్తే రిజైన్​కు సిద్ధమా? అని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భవన్‌‌లో కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీశ్‌‌ మాదిగతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

కేటీఆర్ పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు నీతులు చెబుతావా? అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ చుట్టూ బడా బాబులను బెదిరించి వందల ఎకరాలు దోచుకున్నది నిజం కాదా? అనిప్రశ్నించారు. స్కూటర్‌‌‌‌పై తిరిగిన హరీశ్‌‌​రావుకు వెయ్యి కో ట్ల ఆస్తులు, 1,500 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. వేల కోట్లు దోచుకొన్న మీరు అమృ త్ పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు.

సతీశ్‌‌ మాదిగ మాట్లాడుతూ.. సీఎంని విమర్శిస్తే బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌ ఇంటిపై వెయ్యి చెప్పులు, డప్పులతో దాడి చేస్తామని సతీశ్‌‌ మాదిగ హెచ్చరించారు. ‘‘రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారు. నీవు రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్ర పోతున్న అంటున్నవ్.. నీకు నిద్రపోవడానికి ఎక్కడా జాగా లేదా? తెలంగాణ కోసం కేసీఆర్ నోరు కట్టుకున్నామన్నడు.. నోరు కట్టుకుని రూ.2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డిని రవ్వంత రెడ్డి అంటున్నారు.. ఆయన రవ్వంత రెడ్డి కాదు.. నిప్పు రవ్వ”అని అన్నారు.