సురేఖది దొంగ ఏడుపు : కేటీఆర్

సురేఖది దొంగ ఏడుపు : కేటీఆర్
  • ఆమె పెడబొబ్బలు దేనికి? ఏదేదో ఊహించుకుంటే మాకేం సంబంధం: కేటీఆర్
  • హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారనడం సరికాదు
  • వారికి మనోభావాలు లేవా? 
  • మా ఇంట్లో ఆడోళ్లు బాధపడరా?
  • డబ్బుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్
  • మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్​చాట్

హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖది దొంగ ఏడుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏదేదో ఊహించుకుని పెడబొబ్బలు పెడితే తమకేం సంబంధమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. గతంలో ఎన్నోసార్లు కొండా సురేఖ బూతులు తిట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో భవన్​లో బుధవారం ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అన్నారు. ఆ మహిళలకు మనోభావాలు లేవా? వాళ్లింట్లో ఉన్న మహిళలు బాధపడడం లేదా? వాళ్లు ఏడ్వరా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు.. మా ఇంట్లో మహిళలు బాధపడరా? కొండా సురేఖ గతంలోనూ మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని మీడియాకు పంపిస్తాం”అని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కొండా సురేఖకు, ఇతర మంత్రులకు పంపిస్తానని కేటీఆర్ తెలిపారు. అవి చూసిన తర్వాత సీఎం నోటిని ఫినాయిల్‌‌ వేసి, బాత్రూమ్‌‌ బ్రష్‌‌తో కడగాలని మంత్రి కొండా సురేఖకు, మంత్రులకు ఆయన సూచించారు.

హైడ్రాను రాహుల్ ​గాంధీ నడిపిస్తున్నరు

హైడ్రాను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడిపించడం లేదని, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా రాహుల్ పర్మిషన్ ఇచ్చారా? రేవంత్ వెనుక ఉన్నది రాహుల్ గాంధీనే. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తున్నది రాహులే.. కేవలం డబ్బుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ చేపడ్తున్నరు తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని అన్నరు. ఇప్పుడు ప్రజలు బాధపడుతుంటే ఎందుకు రావడం లేదు? మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనులు ఎవరికి ఇస్తున్నారో కూడా నాకు తెలుసు. త్వరలోనే ఆ వివరాలు బయటపెడ్త. మూసీ ప్రాజెక్టుపైన ఒకట్రెండు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా’’అని కేటీఆర్ ప్రకటించారు. పేదల ఇండ్లకు నష్టం జరగకుండా మూసీని ఏ విధంగా ప్రక్షాళన చేయవచ్చో ప్రజలకు వివరిస్తానన్నారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు, రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారో కూడా చెప్తానని తెలిపారు. మూసీకి ఇరువైపులా బంగారు తాపడం చేయించినా లక్షన్నర కోట్లు ఖర్చు కావని అన్నారు.

కేంద్రం ఒత్తిడితోనే హైడ్రా ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దల ఒత్తిడితోనే హైడ్రా ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాపైన చర్చించేందుకు స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలని డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అందుకే, సెంట్రల్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో భట్టితో మాట్లాడించారని విమర్శించారు.

ప్రభుత్వానికి స్పష్టత లేదు

మూసీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని, అసలు డీపీఆరే లేదని కేటీఆర్ అన్నారు. రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడితే వచ్చే ప్రయోజనం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్న ప్రభుత్వం.. ఎలా వస్తాయో కూడా చెప్పాలని అన్నారు. మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదని విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని డిమాండ్ చేశారు. మూసీపైన ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)పై కూడా వెంకట్​రెడ్డికి అవగాహన లేదన్నారు.

మూసీ బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్

మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూడా కూల్చనివ్వమని చెప్పారు. తెలంగాణ భవన్​కు వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడారు. ‘‘కట్టుకున్న ఇండ్లకు అన్ని పర్మిషన్లు ఉన్న కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడ్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటది. ప్రతిపక్షంగా ఓ వైపు పోరాటం చేస్తూనే.. పేద ప్రజల తరఫున లీగల్ గానూ ఫైట్ చేస్తాం. హైడ్రా, మూసీ బాధితులకు లీగల్ గా హెల్ప్ చేసేందుకు తెలంగాణ భవన్ లో లాయర్ల బృందం ఉంది’’అని కేటీఆర్ తెలిపారు.