
హైదరాబాద్, వెలుగు: బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం ఒక రూపాయికే ‘బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లతో పాటు ఎంఎన్‌పీ (మొబైల్ నంబర్ పోర్టబిలిటీ) ద్వారా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే వారికి కూడా వర్తిస్తుంది. ప్రజల నుంచి అధిక డిమాండ్ ఉన్నందున ఈ ‘ఎఫ్ఆర్సీ’ గడువును ఈ నెల 15 వరకు పొడిగించామని సంస్థ తెలంగాణ టెలికాం సర్కిల్ సీజీఎం జి.రత్న కుమార్ చెప్పారు. ఈ ప్లాన్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాలిడిటీ నెల రోజులు ఉంటుందని చెప్పారు.