జియో, ఎయిర్‌టెల్‌కి నిద్ర లేకుండా చేస్తున్న BSNL.. జస్ట్ రూ.51కే 28 రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్ లాంచ్

జియో, ఎయిర్‌టెల్‌కి నిద్ర లేకుండా చేస్తున్న BSNL.. జస్ట్ రూ.51కే 28 రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్ లాంచ్

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL.. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలకు సవాల్ విసురుతూ జస్ట్ రూ.51లకే 28 రోజుల చెల్లుబాటుతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోజనాలను పొందాలనుకునే వారి కోసం, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా రావాలనుకునే కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ప్రత్యేక ప్లాన్‌ను డిజైన్ చేయబడింది. 

ఈ రూ.51 ప్లాన్ ద్వారా మెుబైల్ యూజర్లు 28 రోజుల పాటు భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అలాగే దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్.. ఇక డేటా విషయానికి వస్తే ప్రతి రోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా అందుకుంటారు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్‌ఎస్‌లు అందుతాయి. ఇంతటి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాలింగ్ ఇవ్వడమే కాకుండా.. కొత్త యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్‌కార్డ్ కూడా ఆఫర్ చేస్తోంది.

అయితే ఈ ధమాకా ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. రూ.51 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మే 22 నుంచి జూన్ 30, 2026 వరకు మాత్రమే ఉంటుంది. కొత్త కస్టమర్లను స్పీడుగా తమ నెట్‌వర్క్‌లోకి చేర్చుకోవాలనే లక్ష్యంతోనే కంపెనీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

అలాగే బీఎస్ఎన్ఎల్ అంతకుముందు ప్రవేశపెట్టిన 'రూ. 1' ఫ్రీడమ్ ఆఫర్ ప్లాన్ కూడా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త యూజర్ల కోసం తీసుకొచ్చిన ఈ రూ.1 ప్లాన్ ద్వారా ఏకంగా 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్, రోజువారీ హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. మొత్తానికి ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ధరల భారంతో విసిగిపోయిన సామాన్య వినియోగదారులను బీఎస్ఎన్ఎల్ వరుస ఆఫర్లతో ఆకట్టుకుంటోంది.