BSNL అద్భుత రీచార్జ్ ప్లాన్..రూ.120లకే 20డేస్..అన్ లిమిటెడ్ కాల్స్

BSNL అద్భుత రీచార్జ్ ప్లాన్..రూ.120లకే 20డేస్..అన్ లిమిటెడ్ కాల్స్

ఇటీవల జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా అన్ని టెలికం ఆపరేటర్లు రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టెలికం సెక్టార్ లో కొత్తకొత్త తక్కువధరల్లో అద్భుతమైన ఆఫర్లతో BSNL కస్టమర్లు మనుసు దోచుకుంటోంది. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లు BSNL వైపు మొగ్గు చూపు తున్నారు. అయితే BSNL కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా రీచార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. తాజాగా కేవలం 120 రూపాయలలోపు  అన్ లిమిటెడ్ కాల్స్ అందించే అద్భుత రీచార్జ్ ప్లాన్ ను అందుబాటులో తెచ్చింది.

BSNL రూ. 118 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ 

BSNL రూ.118ల రీచార్జ్ ప్లాన్ తో కస్టమర్లకు బినిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది 20 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ రీచార్జ్ ప్లాన్తో సబ్స్క్రైబర్లు అన్లిమిటెడ్ కాల్స్ పొందుతారు. అదనంగా 10GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ హార్డీ గేమ్లు, అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్, గేమియం, లిస్ట్న్ పోడోకాస్ట్, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్ టైన్ మెంట్లను కూడా అందిస్తుంది. 

ALSO READ | జియో కొత్త రీచార్జ్ ప్లాన్ రూ. 122, రోజుకు 1GB డేటాతో..

మరోవైపు BSNL, MTNL మిలియన్ల కొద్దీ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పబోతోంది. ఇటీవల BSNL విడుదల చేసిన ఓ వీడియోప్రైవేట్ కంపెనీలకు సవాల్ విసు రుతోంది. త్వరలో సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించబోతుంది BSNL. అందులో భాగంగా 4G టవర్లను కొత్త ప్రదేశాల్లో ఏర్పాటు కు సిద్ధమవుతోంది. దాదాపు 25వేల మొబైల్ టవర్లను అప్ గ్రేడ్ చేసేందుకు BSNL ప్రయత్నాలు చేస్తోంది.