ద్రౌపది ముర్ముకు మాయావతి సపోర్ట్

ద్రౌపది ముర్ముకు మాయావతి సపోర్ట్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్ మాయావతి మద్ధతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు రాష్ట్రపతికి మద్ధతుగా ఓట్లేస్తారని ఆమె తెలిపారు. ‘‘ఎన్డీఏ అభ్యర్థికి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించాం.అయితే మేం బీజేపీ,ఎన్డీఏకు మద్ధతు ఇవ్వడం లేదు. ప్రతిపక్షాలకు కూడా వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నాం’’ అని మాయావతి తెలిపారు  .

ఇక ప్రతిపక్షాలు తమను సంప్రదించలేవని మాయవతి చెప్పారు. ‘‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాల తొలిసమావేశానికి కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించారు. తర్వాత సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం మమ్మల్ని పిలవలేదు. ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎంపిక చేశామని..చెప్పుకునేందుకే విపక్షాలు ప్రయత్నించాయి’’ అని మాయావతి విమర్శించారు. దళితులకు నాయకత్వం వహిస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని అన్నారు.  బీజేపీ, కాంగ్రెస్ లను అనుసరించే పార్టీ తమది కాదని చెప్పారు. తాము అణగారిన వర్గాల వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఏ పార్టీ అయినా దళితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే పరిణామాలతో సంబంధం లేకుండా వాటికి మద్ధతు తెలుపుతామని స్పష్టం చేశారు.