
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారహిల్స్ లోని నంది నగర్ నివాసంలో 2024 మార్చి 5న మధ్యాహ్నం కేసీఆర్, ప్రవీణ్ కుమార్ మధ్య భేటీ అయ్యారు. ఈ సమావేశం చాలా సమయం కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చించారు. ఈ సమావేశంలో బీఎప్పీ పార్టీ ప్రతినిధుల బృందంతో పాటు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమయంలో ఈ భేటీ జరగటం అందరిలో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు.. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయా అనే చర్చ ప్రజల్లో మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు పొత్తుతో ఉన్నారు.. అయితే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని తెలుస్తోంది.
ALSO READ :- లయకారుడి పంచభూత శివలింగాలు.. ఎక్కడ ఉన్నాయంటే....
కాగా బీఆర్ఎస్ పార్టీ సైతం ఒంటరిగా వెళ్లాలే ఆలోచన చేస్తున్నా.. కలిసి వచ్చే పార్టీలను సైతం కలుపుకుని పోవాలనే ఉద్దేశంలో ఉందని సమాచారం. ఇలాంటి సమయంలోనే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ తో భేటీ కావటం ఆసక్తిగా మారింది.