తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో  బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయం :  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో  కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ మద్దతు లేకుండా ఏ పార్టీ రాష్ట్రంలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని తెలిపారు. కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ తెలంగాణలో అధికారంలోకి రావాలని, అందుకు పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని కోరారు.  సోమవారం పార్టీ స్టేట్​ ఆఫీసులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 2,500 మంది బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల ద్వారా కల్వకుంట్ల పాలనకు చరమగీతం పాడి, ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.