మిషన్ భగీరథ నీళ్లు ఎవరెత్తుకెళ్లారు..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మిషన్ భగీరథ నీళ్లు ఎవరెత్తుకెళ్లారు..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సర్కారుపై మరోసారి మండిపడ్డారు. వేల కోట్ల అప్పులు చేసి ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు ఎవరెత్తుకెళ్ళారు..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీళ్లు నిధులు తమ ఫాం హౌసులకు మళ్లించిన పాలకులు.. ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనన్న మాట నిలబెట్టుకోగరా? అని ప్రశ్నించారు. 

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.