
మరికల్/ధన్వాడ, వెలుగు: బీఎస్పీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్చెప్పారు. నారాయణపేట జిల్లా మరికల్, ధన్వాడలో శనివారం ఆయన పర్యటించారు. మరికల్మండల కేంద్రంలో 449 సర్వే నంబర్భూబాధితులను కలిసి మాట్లాడారు. అధికారంలో ఉన్నాం కదా అని రైతుల అనుమతి లేకుండా ఇచ్చిన భూములను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో అక్రమంగా భూములు గుంజుకునే ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలన్నారు. అనంతరం చిత్తనూర్వద్ద ఇథనాల్కంపెనీ పనులను పరిశీలించారు. ప్రజలకు నష్టం కలిగించే కంపెనీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలో జరిగిన బీఎస్పీ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 8 శాతం ఉన్న ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమేంటని అన్నారు.
బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని డిమాండ్‌చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో దళిత మహిళపై బీఆర్ఎస్గుండాలు దాడి చేశారని, ఈప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవైందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు డబ్బులు తీసుకోకుండా నిజాయతీగా ఓటు వేయాలని, బీఎస్పీని గెలిపిస్తే ప్రతి కుటుంబానికి ఎకరా భూమి ఇస్తామని, అసైండ్ భూములకు పట్టాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు ఇవ్వటంతో పాటు 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపులను రద్దు చేసి పాలకేంద్రాలను
ప్రారంభిస్తామన్నారు