బీటెక్ సీట్లు పెరిగినయ్ వెబ్ఆప్షన్లకు 17 వరకు గడువు

బీటెక్ సీట్లు పెరిగినయ్  వెబ్ఆప్షన్లకు 17 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్​లో సీట్లు పెరిగాయి. దీంతో అడ్మిషన్ వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల17 వరకూ పెంచినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఇప్పటివరకూ 93,167 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. 

అత్యధికంగా ఓ విద్యార్థి 1025 ఆప్షన్లు పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే 173 కాలేజీల్లో 98,296 సీట్లకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. దీంట్లో కన్వీనర్ కోటాలో 70,307 సీట్లున్నాయి. అయితే, ఈ విద్యాసంవత్సరం 9వేల సీట్లను ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు కన్వర్షన్​కు పెట్టుకున్నాయి. మరో 20వేల కొత్త సీట్లకూ ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చింది. ఈ రెండు ఫైళ్లు సర్కారు వద్ద ఉన్నాయి. అయితే, ఏ కేటగిరిలో సీట్లు పెరిగాయనేది మాత్రం టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.