భవనంపై నుండి దూకి బీటెక్ విద్యార్థి మృతి

భవనంపై నుండి దూకి బీటెక్ విద్యార్థి మృతి

హైదరాబాద్ మియాపూర్ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్ నగర్  కొల్లురుకు చెందిన శ్రీకాంత్ (21) ఘట్కేసర్ లోని CVSR కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ(బుధవారం) ఉదయం మెట్రోలో మియాపూర్ వెల్లి.. మాతృ శ్రీనగర్ కాలనీలో ఓ భవనం పై నుండి దూకి  మృతి  చెందాడు. సమచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీ సీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.