జగిత్యాల జిల్లాలో బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ 12 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి వారం రోజుల క్రితం కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా రాహుల్ ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ లో ప్రవేట్ హాస్టల్లో ఉంటూ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు రాహుల్. తమ అబ్బాయి ఆచూకీ తొందరగా తెలుసుకొని తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు.
