బుచ్చిబాబు కోసం రంగంలోకి సుకుమార్

బుచ్చిబాబు కోసం రంగంలోకి సుకుమార్

‘ఉప్పెన’ మూవీతో హిట్టు కొట్టి స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు సానా బుచ్చిబాబు. ఇదే జోష్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒ మూవీ తీయడానికి సిద్ధమైయ్యాడు. ఈ మధ్యనే ఎన్టీఆర్‌కు కథ కూడా వినిపించారు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఎన్టీఆర్ సూచించారట. దీంతో బుచ్చిబాబుకు దర్శకుడు సుకుమార్ సాహాయం చేస్తున్నాడని సమాచారం. దీంతో పుప్ప 2 సినిమా లేట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బుచ్చిబాబుపై నెట్టింట్లో వార్తలు హల చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

"ఈ ఫోటో నేను తరువాత చేయబోయే నా సినిమా కథ చర్చ సందర్భంలోది. మా గురువు సుకుమార్ గారు నా కోసం నా సినిమా కథ కోసం హెల్స్ చేయడానికి వచ్చారు. అంతేకాని సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని చర్చించేంత స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం, తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు" అని బుచ్చిబాబు తెలిపాడు.