
గ్రాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ . పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆయన… కొత్త పెన్షన్ విధానం సరళీకరిస్తామన్నారు. పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచుతామన్నారు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు చెప్పారు.. EPFO పరిధిలోకి వచ్చే సభ్యుల సంఖ్య రెండేళ్లలో రెండు కోట్లుకు చేరుకుందన్నారు. కార్మిక ప్రమాద బీమా మొత్తాన్ని రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచినట్లు తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.