తల్లీబిడ్డ తందురుస్త్

తల్లీబిడ్డ తందురుస్త్
  • మహిళా శిశు సంక్షేమానికి మస్తు పైసల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • గతేడాది కన్నా17 శాతం ఎక్కువ
  • రూ.29,164 కోట్లు కేటాయింపు
  • ‘సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు డబ్బులు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: మహిళా శిశు సంక్షేమానికి ఈ సారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మస్తు పైసలిచ్చారు. గతేడాది కన్నా 17 శాతం ఎక్కువ పెంచారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు గతంలో రూ.24,758 కోట్లిస్తే ఈసారి రూ.29,164 కోట్లు పక్కనబెట్టారు. వీటిలో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సర్వీసులకు రూ.19,834 కోట్లు ఖర్చు చేయనున్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెక్యూరిటీ)కైతే కేటాయింపులను దాదాపు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గతేడాది రూ.2,551 కోట్లిస్తే ఈసారి రూ.4,178 కోట్లకు పెంచారు. మెటర్నిటీ బెనిఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిన్న పిల్లల రక్షణకూ బాగానే ఇచ్చారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజనకు గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,200 కోట్లిస్తే ఈసారి రెండింతల కన్నా ఎక్కువ పెంచారు. రూ.2,500 కోట్లు ఇచ్చారు. గర్భవతులు, పాలిచ్చే తల్లుల కోసం రూ. 6 వేల కోట్లు ఈసారి ఖర్చు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పిల్లల రక్షణ కార్యక్రమానికి రూ.925 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచారు. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పోషకాహార లోపం, ఎనిమియాపై యుద్ధానికి ప్రారంభించిన నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.3,400 కోట్లిచ్చారు. ఈ పథకం ద్వారా 10 కోట్ల మంది పిల్లలు లబ్ధి పొందనున్నారు. ప్రధాని మోడీ ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కు రూ.280 కోట్లు కేటాయించారు. మహిళా రక్షణ, సాధికారత పథకానికి రూ.1,315 కోట్ల నుంచి రూ.1,148 కోట్లకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచారు.

మహిళా శక్తి కేంద్రాలకు 150 కోట్లు

కేంద్రం స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే పథకాలకు గతేడాది కన్నా రూ.4,400 పెంచి రూ.28,914 కోట్లు కేటాయించారు. వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టళ్లకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.52 కోట్ల నుంచి రూ.165 కోట్లకు పెంచారు. మహిళా శక్తి కేంద్రాలకు రూ.35 కోట్లు ఎక్కువగా రూ.150 కోట్లు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం ఉజ్వల స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రక్షణ, బాధితుల రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను ప్రభుత్వం ప్రారంభించింది.  దీనికి గతేడాది కన్నా రూ.10 కోట్ల పెంచి రూ.30 కోట్లిచ్చింది. చిన్నపిల్లల కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లకు (నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కూడా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులు పెంచారు. గతం కన్నా రూ.20 కోట్లు పెంచి రూ.50 కోట్లు చేశారు. తల్లిదండ్రులు పనులకు, ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు పిల్లల్ని ఆ క్రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో వదిలి వెళ్లొచ్చు. పిల్లల్ని వాళ్లు బాగా చూసుకుంటారు. విడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇళ్లకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచారు. మహిళాభివృద్ధి, మహిళా సాధికారతకు ఊతమిచ్చేలా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతీ ఇరానీ ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.