స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోల్ కతాలో ప్రకంపనలు సృస్టిస్తోంది. ఇటీవలే బీహార్ రాష్ట్రంలో ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమం పూర్తి చేసిన ఎన్నికల సంఘం (EC).. నెక్స్ట్ ఫోకస్ పశ్చిమబెంగాలపై పెట్టింది. సర్ కు వ్యతిరేకంగా డిసెంబర్ 01న కోల్ కతాలోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట BLO లు భారీ ఆందోళన నిర్వహించారు. తక్కువ సమయంలో మోయలేనంత పనిభారాన్ని వేసి ఈసీ ఒత్తిడికి గురిచేస్తోందని ఆందోళనకు దిగారు.
సర్ విధుల నిర్వహణలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) చనిపోయిన విషయం తెలిసిందే. పనిభారం, ఈసీ టార్గెట్స్ కారణంగానే చనిపోతున్నారని ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ ఆఫీస్ కు ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రావడంతో మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీఎల్ఓ లు బారికేడ్లను తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ బీజేపీ ప్రతినిధులు ఆఫీస్ లోకి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
BLO విధులు నిర్వహిస్తాం కానీ..
సర్ విధులు నిర్వహించడంలో తమకు అభ్యంతరం లేదని ఆందోళన చేస్తున్న బీఎల్ఓ లు చెప్పారు. కానీ ఈసీ ఇచ్చిన డెడ్ లైన్ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని అన్నారు. ఘోరమైన ఒత్తిడి, టార్గెట్ కారణంగా బీఎల్ఓ లు చనిపోతున్నారని పేర్కొన్నారు.
BLO ల మృతికి కారణం TMC అంటున్న బీజేపీ:
బీజేపీ కనుసన్నలలో ఎన్నికల సంఘం పనిచేస్తోందని.. బీహార్ లో మాదిరిగానే వెస్ట్ బెంగాల్ లో కూడా బీజేపీకి లాభం చేకూర్చేలా చేసేందుకు సర్ నిర్వహిస్తోందని ఆరోపణలు వస్తున్న క్రమంలో.. బీజేపీ మాత్రం బీఎల్ఓ ల మృతికి కారణం తృణమూల్ కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపిస్తోంది. టీఎంసీ ప్రభుత్వం బీఎల్ఓలకు వేతనం పెంచకపోవడం వల్లనే సూసైడ్ కు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రతి బీఎల్ ఓ కు రూ.18 వేలు గ్రాంట్ గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈసీ నిర్ణయించిన వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
►ALSO READ | చర్చించకుండా అడ్డుకోవడమే అసలైన డ్రామా.! ప్రధాని మోదీకి ప్రియాంక కౌంటర్
