అంగన్ వాడీలు, ఆశ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ స్కీం

అంగన్ వాడీలు, ఆశ వర్కర్లకు  ఆయుష్మాన్ భారత్ స్కీం

అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు  ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తింప జేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇవాళ పార్లమెంట్ లో 2024-25 ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆమె.. అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సంరక్షణ కవరేజీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండ్  హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ .  ఆసుపత్రిలో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీని అందిస్తుంది.

2023 డిసెంబర్ 27 వరకు 12 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది ఈ పథకం కిందకు వచ్చారు.  మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన  సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. MSMEలకు సకాలంలో ఆర్థికసాయం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.