V6 News

భవిష్యత్ను నిర్మిస్తం..రేపటి తెలంగాణ కోసమే  మా అడుగులన్నీ: శ్రీధర్ బాబు

భవిష్యత్ను నిర్మిస్తం..రేపటి తెలంగాణ కోసమే  మా అడుగులన్నీ: శ్రీధర్ బాబు
  •     రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నామని కామెంట్

హైదరాబాద్, వెలుగు: భవిష్యత్ కోసం ఎదురుచూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము వేసే ప్రతి అడుగు, చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమే అని వివరించారు. ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితో ఇన్నొవేషన్, హ్యూమన్ క్యాపిటల్, సస్టైనబిలిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్​కు శ్రీకారం చుట్టామన్నారు. ఫ్యూచర్ సిటీలో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025’లో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రయాణంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం వేసిన తొలి అడుగే గ్లోబల్ సమిట్ అని అన్నారు. ‘‘భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటా ఉంది. 2024–2025లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు  అయ్యింది.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ. రాష్ట్ర ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రేటు 7.6 శాతం కాగా, జాతీయ సగటు 6.6 శాతం మాత్రమే. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11.9 శాతంగా ఉంటే.. అదే జాతీయ సగటు 10.7 శాతంగా ఉంది. ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 12.6 శాతం వృద్ధి రేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగింది.

మ్యానుఫాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్, గ్యాస్, వాటర్, ఇతర ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్ గా మారిన మంథని నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామం.. రేపటి తెలంగాణకు మార్గదర్శిగా  నిలిచింది’’ అని ఆయన పేర్కొన్నారు.