హైదరాబాద్​లో బిల్డ్​నెక్స్ట్ ఎక్స్​పీరియెన్స్​ సెంటర్

హైదరాబాద్​లో బిల్డ్​నెక్స్ట్ ఎక్స్​పీరియెన్స్​ సెంటర్

హైదరాబాద్, వెలుగు: టెక్-ఎనేబుల్డ్ హోమ్ బిల్డర్ బిల్డ్​నెక్స్ట్​ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లో ఎక్స్​పీరియెన్స్​ సెంటర్​ను బుధవారం ప్రారంభించింది. ఇది అత్యాధునిక వర్చువల్ రియాలిటీ (వీఆర్)  టెక్నాలజీ- తో పనిచేస్తుంది. కస్టమర్​ తను కట్టాలనుకుంటున్న ఇంటిని వీఆర్​ డివైజ్​ ద్వారా ముందుగానే చూసుకోవచ్చు. అవసరమైన మార్పులుచేర్పులు చేసుకోవచ్చు.   టెస్ట్​ డ్రైవ్​ మాదిరిగా కస్టమర్లు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే ముందు దానిని ముందుగానే చూసుకోవచ్చని బిల్డ్​నెక్స్ట్​తెలిపింది. ఈ టెక్నాలజీతో కస్టమర్లు తమ ఇళ్ల డిజైన్‌‌‌‌‌‌‌‌ను విజువలైజ్ చేయడమే కాకుండా గోడల రంగు, షినిషింగ్స్​,  ఫ్లోరింగ్, సీలింగ్ మొదలైన వాటిని నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.  డిజైన్​ ఖరారు అయిన తరువాత ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి ఇస్తారు.  ఈ సందర్భంగా బిల్డ్​నెక్స్ట్​ఫౌండర్​ & సీఈఓ గోపీ కృష్ణన్ ఇలా అన్నారు, “ మా ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌ల టీమ్ ​కస్టమర్లు నచ్చే డిజైన్‌‌‌‌‌‌‌‌లను రూపొందించడానికి వారి అవసరాలను అర్థం చేసుకుంటుంది.

ఈ డిజైన్లు కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి. ఇంటి నిర్మాణం ముందుగా అనుకున్న బడ్జెట్​ను మించకుండా చూసేందుకు బిల్డ్​నెక్స్ట్​ బిల్డింగ్ పెర్ఫార్మెన్స్​ ఇండెక్స్​ను (బీపీఐ)ని అభివృద్ధి చేశాం. దీనివల్ల స్థలాన్ని కూడా సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. బడ్జెట్​ విషయంలో మేం మా హామీకి కట్టుబడి ఉంటాం. ఎట్టిపరిస్థితుల్లోనూ పరిమితిని మించనివ్వం” అని వివరించారు. బిల్డ్​నెక్స్ట్​ కో–ఫౌండర్​  సీఓఓ, ఫినాజ్​ నాహా మాట్లాడుతూ  “మేం తమిళనాడు,  కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో అడుగుపెట్టబోతున్నాం. ప్రస్తుతం కేరళలోని అన్ని జిల్లాల్లో ఇండ్లు నిర్మించాం.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో డిజైన్  డెలివరీ దశల్లో 150కిపైగా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.  ఇప్పటికే 70కిపైగా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను అప్పగించాం. ఇప్పటి వరకు రూ.28 వేల కోట్ల నిధులు సేకరించాం. పోయిన ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్ల టర్నోవర్​ సాధించాం”అని ఆయన వివరించారు.