బుజ్జి పాత్ర చాలా స్ట్రాంగ్

బుజ్జి పాత్ర  చాలా స్ట్రాంగ్

‘డీజే టిల్లు’ చిత్రంలో రాధిక పాత్రతో అందరికీ గుర్తుండిపోయింది నేహా శెట్టి. ఇప్పుడు  ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి చెప్పిన విశేషాలు. 

‘‘ఈ స్ర్కిప్ట్ చాలా భిన్నంగా ఉంటుంది. నైంటీస్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో నడిచే కథ. బుజ్జి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించా. నాది చాలా స్ట్రాంగ్ రోల్. ఒకమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఇందులో చూడొచ్చు. రత్నమాలగా అంజలి నటించారు. మా ఇద్దరి చుట్టూనే కథ తిరుగుతుంది. పోస్టర్స్ చూసి.. యాక్షన్ మాత్రమే ఉంటుందని అనుకోవద్దు. రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నీ ఉంటాయి. 

నైంటీస్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌ కావడంతో అప్పటి హీరోయిన్ శోభన గారిని రిఫరెన్స్‌‌‌‌గా తీసుకోమన్నారు డైరెక్టర్.  చీరకట్టు, జుట్టు, కాటుక ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టాం. నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు.  దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశా.  ఈ పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నా.  విశ్వక్ సేన్‌‌‌‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. 

అతను చాలా హార్డ్ వర్కర్.  షూటింగ్ సమయంలో చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. దర్శకుడు కృష్ణ చైతన్య చాలా సాఫ్ట్ పర్సన్. ఆయన  కథ రాసిన విధానం, తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చుతుంది. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. వారి ప్రొడక్షన్‌‌‌‌లో బ్యాక్‌‌‌‌ టు బ్యాక్ సినిమాలు చేయడం హ్యాపీ. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌‌‌‌తో ఒక సినిమా చేయబోతున్నా. త్వరలోనే  షూటింగ్ ప్రారంభమవుతుంది’’.