
Stocks To BUY: ఆగస్టు 27 బుధవారం నుంచి భారత ఎగుమతులు ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలకు లోబడి ఉన్నాయి. దీంతో దేశీయంగా ఎగుమతుల్లో మెజారిటీ శాతం పన్నుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని కంపెనీలు ప్రస్తుతం ఇండియా వేస్తున్న పన్నులతో చాలా వస్తువులకు ఆర్డర్లను క్యాన్సిల్ చేయటంతో పాటు ప్రత్యామ్నాయ సప్లయర్ల కోసం పరిశీలిస్తున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్స్ వల్ల కొన్ని వ్యాపార సంస్థలు అడ్డంకులను ఎదుర్కొంటుండగా.. మరికొన్ని కంపెనీలను మాత్రం పెట్టుబడిదారులు గమనించాలి.
ట్రంప్ సుంకాలు భారతీయ ఇన్వెస్టర్లను భయాలకు గురిచేస్తున్న సమయంలో కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడు శ్రీకాంత్ చౌహాన్ మాత్రం పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చిపెట్టగల 10 కంపెనీల వివరాలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి బలహీనంగా ఉందన్న ఆయన 6 షేర్లకు కొనుగోలు రేటింగ్ ఇవ్వటంతో పాటు 4 కంపెనీ షేర్లకు అక్యూమిలేట్ చేసుకోవచ్చని చెప్పారు.
ALSO READ : నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్స్..
- అదానీ పోర్ట్స్ స్టాక్ ప్రస్తుతం రూ.1,315.50 రేటు వద్ద ఉండగా.. దీని టార్గెట్ ధర రూ.1,840గా చెప్పారు. అంటే ఇన్వెస్టర్లకు 40% వరకు లాభం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
- రియల్టీ రంగానికి చెందిన DLF స్టాక్ టార్గెట్ ధరను రూ.1,020 పేర్కొనగా.. ఇది ప్రస్తుత ధర రూ.754.75 కంటే 35% ఎక్కువగా ఉంది.
- ఉక్కు తయారీ సంస్థ జిందాల్ స్టీల్ కంపెనీ షేర్లు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర కంటే 26 శాతం పెరిగి భవిష్యత్తులో రూ.1225 రేటుకు చేరుకోవచ్చని చౌహాన్ చెప్పారు.
- ఐటీ సేవల రంగానికి చెందిన దిగ్గజం టెక్ మహీంద్రా తన వ్యాపారాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందన భవిష్యత్తులో స్టాక్ ఒక్కోటి రూ.1,830కి చేరతాయని నిపుణుడు అంచనా వేశారు.
- ఆటో రంగానికి చెందిన మహీంద్రా & మహీంద్రా ట్రాక్టర్లతో పాటు కార్ల వ్యాపారం మెరుగుపడుతుందని దీంతో స్టాక్ ప్రస్తుతం ఉన్న రేటు రూ.3,330 నుంచి పెరిగి రూ.3,800కి చేరుకుంటుందని కొత్త టార్గెట్ ధరను వెల్లడించారు శ్రీకాంత్.
ఇదే క్రమంలో శ్రీకాంత్ చౌహాన్ బులిష్ వ్యూహాన్ని కలిగి ఉన్న ఇతర స్టాక్స్ లిస్ట్ గమనిస్తే..
- కోఫోర్జ్ స్టాక్15% పెరుగుదలను చూడనుంది.
- అంబర్ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 23% పెరుగుదలను చూడనుంది.
- కెనరా బ్యాంక్ స్టాక్ 18% పెరుగుదలను చూడనుంది.
- కాస్ట్రోల్ ఇండియా స్టాక్ 17% పెరుగుదలను చూడనుంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్12% పెరుగుదలను చూడనుంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.