హైదరాబాద్-విజయవాడ హైవే బ్లాక్.. చక్కా జామ్ కు మద్దతుగా ఎడ్లబండ్ల ర్యాలీ

హైదరాబాద్-విజయవాడ హైవే బ్లాక్.. చక్కా జామ్ కు మద్దతుగా ఎడ్లబండ్ల ర్యాలీ

హైదరాబాద్ హయత్ నగర్ లో తెలంగాణ ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై చక్కా జామ్ కొనసాగుతోంది. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేను బ్లాక్ చేస్తున్నారు రైతుసంఘాల నేతలు. ఎడ్ల బండ్లపై హైవేపై ర్యాలీ తీస్తున్నారు. మధ్యాహ్నం మూడింటి వరకు ఈ నిరసన ప్రదర్శన కొనసాగనుంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు… MSP కల్పించాలని డిమాండ్లతో రాస్తారోకో చేస్తున్నారు రైతులు. కాంగ్రెస్ సహా పలు విపక్ష నేతలు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఆందోళన నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  హైదరాబాద్ మలక్ పేటలోని  నల్లగొండ చౌరస్తాలో నిరసన  తెలిపారు  ప్రజాసంఘాల నేతలు , కార్యకర్తలు. కొత్త  అగ్రి చట్టాలను  రద్దు చేయాలని  డిమాండ్  చేశారు. కేంద్ర  ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.

see more news

యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి

రవిశాస్త్రీకి 120 ఏళ్లా.? గూగుల్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

ప్లీజ్.. భారతరత్న క్యాంపెయిన్ ఆపేయండి

V ఆకారంలో ఆర్థిక రికవరీ..దేశం ముందు అనేక సవాళ్లు