NIT Jobs: వరంగల్ నిట్లో ఉద్యోగాలు... అర్హతలు... ఇతర వివరాలు ఇవే..!

NIT Jobs: వరంగల్ నిట్లో ఉద్యోగాలు... అర్హతలు... ఇతర వివరాలు  ఇవే..!

వరంగల్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 17.

పోస్టులు: 05 ( ప్రిన్సిపల్ సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్ 03, ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ 01, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) 01) 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: ప్రిన్సిపల్ సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ పోస్టులకు 56 ఏండ్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్)  35 ఏండ్లు మించకూడదు.   
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 17.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.