నిర్మల్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఎడ్ల బండి.. మహిళ మృతి

నిర్మల్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఎడ్ల బండి.. మహిళ మృతి

నైరుతు రుతుపవనాలు చివరి దశలో గర్జిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా విరుచుకుపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

ఆది, సోమవారం (సెప్టెంబర్ 21,22) కురిసిన  వానలకు నిర్మల్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తు్న్నాయి. రోడ్లపైనుంచి వాగులు ప్రవహిస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 

సోమవారం కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లా  బైంసా మండలం బాబుల్  గామ్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఎండ్ల బండి వరదలో  కోట్టుకుపోయింది. ఎండ్లబండితో పాటు సురేష్  అనే వ్యక్తి, మహిళ కొట్టుకుపోయారు.  ఈ  ప్రమాదంలో మహిళ చనిపోయింది. మహిళలతో పాటు ఒక గేదే  ప్రాణాలు కోల్పోయింది. 

సమాచారం తెలుసుకున్న ఎస్పీ జానకి షర్మిల..  సంఘటన స్థలాన్ని  పరిశీలించారు. స్థానికులను   వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.