IPL 2026: ముంబై కెప్టెన్‎గా బుమ్రా.. పంజాబ్‎తో మ్యాచ్‎కు పాండ్య, సూర్య దూరం..!

IPL 2026: ముంబై కెప్టెన్‎గా బుమ్రా.. పంజాబ్‎తో మ్యాచ్‎కు పాండ్య, సూర్య దూరం..!

సిమ్లా: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం (మే 14) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‎లోని ధర్మశాల స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై స్టాండ్-ఇన్ కెప్టెన్‎గా వ్యవహరిస్తున్నారు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ హర్ధిక్ పాండ్య ఈ మ్యాచుకు దూరమయ్యాడు. పాండ్యతో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, అల్లా ఘజన్‎ఫర్ కూడా ఈ గేమ్ ఆడటం లేదు. 

పంజాబ్‎తో మ్యాచుకు ఈ ముగ్గురు దూరం కావడానికి గల కారణాలను టాస్ సమయంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ బుమ్రా వెల్లడించాడు. వెన్ను నొప్పి గాయం కారణంగా గత రెండు మ్యాచులకు దూరమైన హర్ధిక్ పాండ్య ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచుకు కూడా అందుబాటులో లేడని తెలిపాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్, అల్లా ఘజన్‎ఫర్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. మొత్తం రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్‎కు ఫస్ట్ టైమ్ కెప్టెన్‎గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు బుమ్రా. 

ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకుని అతిథ్య పంజాబ్‎ను ఫస్ట్ బ్యాటింగ్‎కు ఆహ్వానించాడు. ఇరు జట్లలో మార్పులు చేర్పులు జరిగాయి. పంజాబ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. హర్‎ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అజ్మతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి వచ్చారు. 

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న బుమ్రా.. ముంబైలో కీలక మార్పులు

ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించిన ముంబైకి ఈ మ్యా్చ్ నామమాత్రమే కాగా, ప్లే ఆఫ్స్‎కు చేరాలంటే ఈ గేమ్‎లో గెలవడం అయ్యర్ సేనకు ఎంతో అవసరం. దీంతో సొంతగడ్డపై ముంబైను చిత్తు చేయాలని పంజాబ్ ఉవ్విళ్లూరుతోంది. 

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(c), రఘు శర్మ

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్