IPL 2026: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న బుమ్రా.. ముంబైలో కీలక మార్పులు

IPL 2026: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న బుమ్రా.. ముంబైలో కీలక మార్పులు

సిమ్లా: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం (మే 14) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మోస్ట్ ఫేవరెట్ టీమ్స్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‎లోని ధర్శశాల స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎంచుకుని పంజాబ్‎ను తొలుత బ్యాటింగ్‎కు ఆహ్వానించాడు. ఇరు జట్లలో మార్పులు చేర్పులు జరిగాయి.

వెన్నునొప్పి కారణంగా ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచుకు దూరం కాగా, వ్యక్తిగత కారణాలతో స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ ఈ గేమ్ ఆడటం లేదని బుమ్రా తెలిపాడు. పంజాబ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. హర్‎ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అజమతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి వచ్చారు. 

ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించిన ముంబైకి ఈ మ్యాచ్ నామమాత్రమే కాగా, ప్లే ఆఫ్స్‎కు చేరాలంటే ఈ గేమ్‎లో గెలవడం అయ్యర్ సేనకు ఎంతో అవసరం. దీంతో సొంతగడ్డపై ముంబైను చిత్తు చేయాలని పంజాబ్ ఉవ్విళ్లూరుతోంది. 

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(c), రఘు శర్మ

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్