
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ చికెన్ రెస్టారెంట్ బ్రాండ్ కేఎఫ్‌సీ ఇంటర్నేషనల్ బర్గర్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐదు రకాల జింగర్ బర్గర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని పూర్తిగా చికెన్‌తోనే తయారు చేశామని తెలిపింది. మెత్తటి నువ్వుల బన్‌లో కరకరలాడే ఫిల్లెట్, వెజిటబుల్ క్రీము, మయో సాస్‌తో కూడిన టైమ్‌లెస్ అమెరికన్ క్లాసిక్ జింగర్, కరేబియన్ స్పైసీ జింగర్ వంటివి వీటిలో ఉంటాయి. ధరలు రూ.179 నుంచి మొదలవుతాయి. ఇంటర్నేషనల్ బర్గర్ ఫెస్ట్‌లో భాగంగా కేఎఫ్‌సీ పనీర్ జింగర్‌ను కూడా కేఎఫ్‌సీ పరిచయం చేస్తోంది.