సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో పది నెలల బాలిక మరణించగా, పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన షేర్ల హరీశ్, భవాని దంపతుల కూతురు(10 నెలలు) విష్ణుప్రియ ఈ నెల 18న ప్రమాదవశాత్తు మంచంపై నుంచి కింద పడి మరణించిందని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే, తన కూతురును భర్త హరీశ్ కొట్టడం వల్లే గాయపడి మృతిచెందిందని భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా గ్రామ శివారులో పూడ్చిపెట్టిన విష్ణుప్రియ డెడ్ బాడీని వెలికి తీసి ఫోరెన్సిక్ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారు. ఇన్చార్జి తహసీల్దార్ సిరిపురం గిరి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ పాల్గొన్నారు.
