
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన బూర్ల సంతోష్–కల్యాణి దంపతుల కూతురు బూర్ల అవంతి నీట్ 2025 ఆల్ ఇండియా దివ్యాంగుల కేటగిరిలో 2671 ర్యాంకు తెచ్చుకొని హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ ఎ.భాస్కర్‌తో కలిసి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే మంగళవారం అవంతిని సన్మానించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరా లను అధిరోహించాలని, ప్రభుత్వపరంగా సాయం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీవో మహేశ్ పాల్గొన్నారు.