మండుతున్న ఉత్తరాది రాష్ట్రాలు.. ఎండతీవ్రతకు ఆరుగురు జవాన్లు మృతి 

మండుతున్న ఉత్తరాది రాష్ట్రాలు.. ఎండతీవ్రతకు ఆరుగురు జవాన్లు మృతి 

లక్నో:ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆరుగురు జవాన్లు.. ఎండ తీవ్రతతో మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరో 15మంది మిర్జాపూర్ లోని ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు.  

మరోవైపు బిహార్ లోనూ ఇవాళ వడదెబ్బతో ఐదుగురు మరణించారు. గత రెండు రోజుల్లో బిహార్ లో ఎండల తీవ్రతో మృతి చెందినవారి సంఖ్య 15కు చేరింది. అధిక ఉష్ణోగ్రతుల నమోదవుతున్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.