
హైదరాబాద్, వెలుగు: ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించడానికి అభీఓట్పేరుతో ప్రత్యేక డిస్కౌంట్సేల్ నిర్వహిస్తున్నట్టు బస్అగ్రిగేటర్ ప్లాట్ఫారమ్అభీబస్ ప్రకటించింది. ఈ 13వ తేదీన ఓటు వేసేందుకు సొంతూళ్లకు వేళ్లే వారికి 20 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. టికెట్‌పై రూ.250 తగ్గింపుతో పాటు రూ. 100 క్యాష్‌బ్యాక్ ఇస్తామని తెలిపింది. ఇందుకోసం ‘ABHIVOTE’ అనే కోడ్‌ను బుకింగ్టైంలో టైప్‌చేయాలి. ఈ ఆఫర్ ఏపీ, తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించామని అభీబస్ తెలిపింది. అభీబస్ 2024 ఆర్థిక సంవత్సరం మొదటి సగం నాటికి బస్ టిక్కెట్లలో 12.5శాతం మార్కెట్ వాటాను సాధించింది.