కరెంటు తీగలకు తగిలిన బస్సు.. ఆరుగురు మృతి

కరెంటు తీగలకు తగిలిన బస్సు.. ఆరుగురు మృతి

ఒడిశా: బస్సు కరెంటు తీగలకు తగలడంతో ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని  గజాం జిల్లా బొలంత్రలో జరిగింది.  మంద్ రాజ్ పూర్ రోడ్డులో ప్రయాణీకులతో వెళ్తున్న  ఓల్వో బస్సుకు ప్రమాదవశాత్తు 11 కె.వి కరెంటు తీగలు తగిలాయి. దీంతో అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా బస్సులో వున్నవారందరికీ కరెంటు షాక్ కొట్టింది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న MKCG మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు స్థానికులు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 40మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.