
గోవాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన ఉన్న గుడిసెలో నిద్రిస్తున్న వారిపైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లిన ఘటన దక్షిణ గోవా జిల్లాలోని వెర్నా దగ్గర మే 26వ తేదీ ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సౌత్ గోవా పోలీసు సూపరింటెండెంట్ సునీతా సావంత్ మాట్లాడుతూ.. " ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులను తీసుకువెళ్తున్న బస్సు... మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడిసె లోపల నిద్రిస్తున్న కార్మికుల్లో నలుగురు మరణించగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం మడ్‌గావ్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు అని తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా బీహార్‌కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.