బిజినెస్ ​క్వీన్​ స్రవంతి

బిజినెస్ ​క్వీన్​ స్రవంతి

ఏ వ్యాపారమైనా ఐడియాతో పాటు దాన్ని ప్రమోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ బ్రాండింగ్ నుంచి మార్కెట్ లోకి వెళ్లేంత వరకు ఉండే ప్రాసెస్ ని అలవోకగా చేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది స్రవంతి ఎల్లసిరి. వైద్య వృత్తి వదిలి సొంత బిజినెస్​చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఫోర్బ్స్​జాబితాలో చోటు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. చిన్న వయసులోనే 60 కంపెనీలకు బిజినెస్​ డెవలప్​మెంట్​ మేనేజర్​గా పనిచేసి ఆదర్శ ప్రాయంగా నిలుస్తోంది. డాక్టర్ టు బిజినెస్ ఎంట్రప్రెన్యూరర్ గా గతేడాది 8 అవార్డులు సొంతం చేసుకుంది. .

సక్సెల్ ఫుల్ ఎంట్రప్రెన్యూరర్

ఒకే ఏడాదిలో ఎనిమిది అవార్డులు

ఫోర్బ్స్​ జాబితాలో చేరడమే లక్ష్యంగా ముందుకు

హైదరాబాద్, వెలుగు:స్రవంతి సొంతూరు ఆంధ్రప్రదేశ్​లోని  నెల్లూరు జిల్లా వెంకటగిరి. తల్లి కోరిక మేరకు మెడిసిన్​లో చేరినా చిన్నప్పటి నుంచే బిజినెస్ చేయాలని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉండేది. 2012లో ఎంసెట్ లో ర్యాంక్ సాధించాక గ్రాడ్యుయేషన్ లో చేరారు. చదువుతూనే వివిధ కంపెనీలకు ఫ్రీలాన్సర్ మార్కెటింగ్ ఛీప్ గా పనిచేశారు. బిజినెస్ వైపు వెళ్లాలనే ఆలోచన ఉన్నా ఇంట్లో చెప్తే ఏమంటారోననే భయంతో చాలారోజుల వరకు ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఉదోగ్యం చేశారు. ఆ తర్వాత తన తల్లి రాజమ్మ ప్రోత్సాహంతో డాక్టర్ ప్రొఫెషన్ కి ఫుల్ స్టాప్ చెప్పి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. మొదట ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు మార్కెటింగ్ ఛీప్ గా పనిచేశారు. తర్వాత హెల్త్ , ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు అన్నిరకాల బిజినెస్ ఎలిమెంట్స్ ప్రమోట్ కోసం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా వ్యవహరించారు.

ఉపాధినిస్తున్న ‘బాక్స్​విష్​’

బిజినెస్ డెవలప్​మెంట్​మేనేజర్ గా చేస్తున్న సమయంలో అనేక కంపెనీల ఐడెంటిటీతో స్రవంతికి విజిటింగ్ కార్డ్స్ ఉండేవి. ఏ కంపెనీకి వర్క్ చేస్తే ఆ కార్డ్ తోనే అందరితో కమ్యునికేట్ అయ్యేవారు. అలా ఉండటం తనకు నచ్చలేదని,  సొంత కంపెనీ పేరుతోనే కార్డ్ ఉండాలని భావించాలని చెప్పారు. దీంతో పనిచేస్తున్న కంపెనీల అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు వెయిట్​చేసి, 2017లో ‘బాక్స్ విష్’ అనే బిజినెస్ అడ్వైజింగ్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. రూ.500ల జీతంలో ఉద్యోగం మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు 65 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒక క్లైంట్ తమ కంపెనీకి వచ్చినప్పటి నుంచి వారి ప్రొడక్ట్స్ ఎస్టాబ్లిష్ అయ్యేంత దాకా బాధ్యతతో ఉంటామని చెబుతున్నారు. బాక్స్ విష్ అనే కంపెనీ ద్వారా భవిష్యత్ లో 5వేల మందికి ఎంప్లాయిమెంట్ కల్పించే టార్గెట్ పెట్టుకున్నామని తెలుపుతున్నారు.

గతేడాదిలో 8 అవార్డులు

విమెన్ బిజినెస్ ఎంట్రప్రెన్యూర్ గా స్రవంతి గతేడాది 8 అవార్డులు కైవసం చేసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి నేషనల్ అవార్డ్-, ఉమెన్ ఇన్​స్పిరేషన్ అవార్డ్, రాష్ట్ర ప్రభుత్వంనుంచి హర్ ఎక్సెలెన్సీ అవార్డ్, బిజినెస్ మింట్ నుంచి అవుట్ స్టాండింగ్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్, ఇన్నోవెక్సియా ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ ఎమర్జింగ్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్, బిజినెస్ మింట్ నుంచి బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్ లను అందుకున్నారు.