హైదరాబాద్ లో వ్యాపారి కైలాష్ చౌదరి దారుణ హత్య

హైదరాబాద్ లో వ్యాపారి కైలాష్ చౌదరి దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో కైలాష్ చౌదరి(38) అనే వ్యాపారిని ఆదివారం ఉదయం గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. చౌదరి తలపై సుత్తితో దారుణంగా కొట్టడంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం దవాఖానకు తరలించారు. హత్యకు గల కారణాలను సేకరించిన పోలీసులు ప్రాథమిక విచారణలో.. వివాహేతర సంబంధమే చౌదరి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.