
ముథోల్, వెలుగు: ముథోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం భైంసా–బాసర రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తమ కాలనీలోని బోరు చెడిపోయి 15 రోజులు అవుతోందని, అప్పటి నుంచి తాగు నీరు రావడం లేదన్నారు. గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం లేదని వాపోయారు. మంచి నీళ్లు లేక పడరాని పాట్లు పడుతున్నామన్నారు. వెంటనే బోరుకు రిపేర్లు చేయించి, తాగు నీరు అందించాలని కోరారు.
రాస్తారోకోతో ఇరువైపు వాహానాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాలసీవాసులతో మాట్లాడారు. సంబంధింత అధికారులతో మాట్లాడి తాగు నీటి సమస్యన పరిష్కరించే చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.