కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లో స్వల్ప భూకంపం జనాలను భయాందోళనకు గురిచేసింది. కౌటాల, బెజ్జూర్, పెంచికల్ పేట్ ప్రాంతాల్లో బుధవారం (ఫిబ్రవరి 25) అర్ధరాత్రి మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. రాత్రి 11.49 నిమిషాల సమయంలో మూడు సెకన్ల పాటు భూకంపం వచ్చింది.
ప్రజలు అర్ధ రాత్రి వేళ నిద్రలో ఉన్న సమయం కావడంతో దీన్ని పెద్దగా గుర్తించలేదు. కొందరు మాత్రం భూమి కంపించిన విషయాన్ని గుర్తించి ఇండ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. ఉదయం ఈ విషయం ఒకరికొనరు అడిగి నిర్ధారించుకున్నా రు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9గా నమోదు అయింది. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగలేదు.
