ఐ లవ్ ఇండియా కానీ.. భారతదేశంలో ఉండటం గురించి నిజం చెప్పిన అమెరికా మహిళ..

ఐ లవ్ ఇండియా కానీ.. భారతదేశంలో ఉండటం గురించి నిజం చెప్పిన అమెరికా మహిళ..

ఇండియాలో ఉంటున్న  ఒక అమెరికన్ మహిళ ఈ దేశంలో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె చేసిన పోస్ట్ కాస్త  వైరల్ అయింది. అయితే కంటెంట్ క్రియేటర్ ఆయిన  క్రిస్టెన్ ఫిషర్ ఏ దేశం కూడా పర్ఫెక్ట్ కాదని చెబుతూ భారతదేశంలో తనకు నచ్చిన,  నచ్చని విషయాలను చెప్పుకొచ్చింది. 

భారతదేశంలో ఉంటున్న  ఒక విదేశీయురాలిగా ఏ ప్రదేశం పర్ఫెక్ట్ కాదని ఒప్ప్పుకోవడాని నేను సిగ్గుపడను. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, కానీ అంతగా సంతృప్తి లేదు. కొన్ని లోపాలు అలాగే నాకు నచ్చని అంశాలు ఉన్నాయి అంటూ రాసింది. అలాగే అమెరికాలో కూడా కొన్ని నచ్చని విషయాలు ఉన్నాయని, ఇతరులు ఊహించినంత ఉండదని అన్నారు.

మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని లోపాలు ఉంటాయి, మన పని ఏమిటంటే ఏది ఏమైనా అందులో మంచిని చూడటం నేర్చుకోవడం. మనం ఎక్కడ ఉన్నా మన స్వంత ఆనందాన్ని సృష్టించుకునే శక్తి మనకు ఉందని నేను నమ్ముతున్నాను అంటూ పేర్కొంది.


ఫిషర్ ఇండియాలో ఇష్టపడేవి, ఇష్టపడనివి చూస్తే ఆమెకు భారతీయ ఆహారం చాలా నచ్చిందట. ఇక్కడ మైనారిటీగా ఉండటం  ఇష్టపడిన ఆమె,  పిల్లలకి భారతదేశం మంచి  ప్రదేశం అని అభిప్రాయపడింది. అలాగే శాకాహారం చాల మంచిదని ఆమెకు అనిపించిందట. అంతేకాదు భారతదేశం చాల మర్యాదపూర్వకమైన దేశంగా, ఇక్కడ ఆహారం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పింది. ఇంకా స్థానిక వ్యవసాయ పద్ధతులు బాగున్నాయని తెలిపింది.

ఇండియాలో  ఉండటం వల్ల తన కుటుంబాన్ని చూడలేకపోతున్నందుకు బాధ కలిగిస్తుందని, అయితే  ఢిల్లీలో కాలుష్యం నచ్చలేదని, రోడ్లపై ఉండే చెత్త అసహ్యంగా అనిపిస్తుందని చెప్పింది. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోకి 120,000 కంటే పైగా  వ్యూస్, వందల కామెంట్లు వచ్చాయి. చాల మంది ఫిషర్ చెప్పిన మాటలకి సపోర్ట్ కూడా చేసారు. 

ఒక నెటిజన్ మీ నిజాయితీ చాలా నచ్చింది, మీరు చెప్పింది నిజమే. ఎక్కడ కూడా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండవు. మనం కొంచెం అడ్జస్ట్ అయితే చాలు అనగా, మరొకరు మీరు చెప్పిన మాటలకి నేను ఏకీభవిస్తున్నాను. భారతదేశం పరిపూర్ణమైనది కాదు, కానీ మనం కోరుకునే పరిపూర్ణ దేశంగా మార్చడానికి మనం కృషి చేయవచ్చు అంటూ కామెంట్ చేసారు. ఇంకొకరు చాలా ఇన్స్పిరేషనల్ పోస్ట్. నేను చాలా నెగటివ్ విషయాలపైనే దృష్టి పెడతాను. కానీ మీ పోస్ట్, మీ ఆలోచనలు నన్ను మంచి విషయాలను చూడటానికి ప్రేరేపించాయి అని అన్నారు.

నలుగురు పిల్లల తల్లి అయిన క్రిస్టెన్ ఫిషర్ భారతదేశంలో సెటిల్ అవ్వాలనే తన నిర్ణయం గురించి ఏమాత్రం భాదపడటం  లేదని ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పింది. మేము నాలుగు సంవత్సరాల క్రితం ఫ్యామిలీతో ఇండియాకి వచ్చాము, ఆసమయంలో కొంచెం కూడా భాదపడలేదు. ఈ నాలుగు సంవత్సరాలలో నేను అద్భుతమైన వ్యక్తులను కలిశాను, కొన్ని అద్భుతమైన ప్రదేశాలను చూశాను, ఎంతో రుచికరమైన ఫుడ్ తిన్నాను. భారతదేశం నా హృదయాన్ని మార్చేసింది అని  చెప్పింది.