న్యూయార్క్ మేయర్ మమ్దానీని గెలిపించిన ఉచిత హామీలు.. బస్సు ఫ్రీ.. అద్దెలు తగ్గిస్తా.. సర్కార్ కిరాణా షాపులు..

న్యూయార్క్ మేయర్ మమ్దానీని గెలిపించిన ఉచిత హామీలు.. బస్సు ఫ్రీ.. అద్దెలు తగ్గిస్తా.. సర్కార్ కిరాణా షాపులు..

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఉచితం అంటే చాలు జనం ఎలా ఓట్లు వేస్తారో.. ఎలా రియాక్ట్ అవుతారో కళ్లారా చూపించారు అగ్రరాజ్యం అమెరికాలోని ఆర్థిక రాజధాని న్యూయార్క్ జనం. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటివ్ అభ్యర్థి.. ఇండియా మూలాలు ఉన్న ముస్లిం అయిన జోహ్రాన్ మమ్ధానీ గెలుపే నిరూపించింది. న్యూయార్క్ మేయర్ గా బంపర్ మెజార్టీతో గెలిచిన జోహ్రాన్ మమ్ధానీ గెలుపు వెనక ఆయన ఉచిత హామీలు చాలా కీలకంగా పని చేశాయని.. ఇప్పుడు వాటి అమలు అనేది ఆయన ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని అమెరికా పత్రికలు రాస్తున్నాయి. ఇంతకీ మమ్థానీ ఇచ్చిన ఉచిత హామీల లిస్ట్ చూద్దామా.. 

>>> ఫ్రీ బస్సు..
>>> న్యూయార్క్ నగరంలో అద్దెలు భారీగా ఉంటాయి.. వాటిని తగ్గిస్తాను.. పెంచకుండా చూస్తాను.
>>> పిల్లల సంరక్షణ ఫ్రీ.. న్యూయార్క్ సిటీలో తల్లి దండ్రులు ఇద్దరూ ఉద్యోగానికి వెళితే.. పిల్లలను డే కేర్ సెంటర్ లో వేస్తారు కదా.. అది ఇప్పుడు ఫ్రీ.. ఉచితం..
>>> ప్రభుత్వం ఆధ్వర్యంలో కిరాణా షాపులు.. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కిరాణా షాపులు ప్రభుత్వమే ఓపెన్ చేస్తుందని ప్రకటించాడు.
>>> అందరికీ అందుబాటులో సొంతిల్లు.. రాబోయే పదేళ్లలో 2 లక్షల ఇళ్లు చౌకగా నిర్మించి ఇస్తానని చెప్పాడు..

ఫ్రీ బస్సు..

న్యూయార్క్ నగర ప్రజలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తానని మమ్దానీ ఎన్నికల్లో హామీ ఇఛ్చారు. అలాగే, బస్సుల వేగం కూడా పెంచేందుకు చర్చలు తీసుకుంటానని వాగ్దానం చేశాడు. న్యూయార్క్ నగరం అంతటా ఐదు లైన్ల రోడ్లు నిర్మించడం, బస్ క్యూ జంప్ సిగ్నల్‌లను విస్తరించడం, డబుల్ పార్కర్‌లను దూరంగా ఉంచడానికి ప్రత్యేక లోడింగ్ జోన్‌లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఫ్రీ బస్సు స్కీమ్ కోసం కార్పొరేట్ పన్నులు, ఆదాయ పన్నులు పెంచాలని మమ్దానీ ప్రచారం చేశారు. మమ్దానీ విజయంలో ఫ్రీ బస్సు స్కీమ్ కీ రోల్ ప్లే చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అద్దెలు తగ్గింపు:

న్యూయార్క్ నగరంలో నివసించే వారిలో ఎక్కువ మంది అద్దెకు ఉంటున్న వారే. చాలా మంది అద్దెదారులు సగటున రెండు మిలియన్లకు ( ఇండియా కరెన్సీలో 20 లక్షలు) పైగా రెంట్ ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారు. ఇంత అద్దె చెల్లించడం కార్మిక వర్గానికి కష్టం. కాబట్టి అపార్ట్‌మెంట్లపై అద్దెలను 12.6 శాతం తగ్గించేందుకు కృషి చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చారు. న్యూయార్క్ వాసులకు అవసరమైన గృహాలను నిర్మించడానికి, అద్దెను తగ్గించడానికి అందుబాటులో ఉన్న ప్రతి వనరులను ఉపయోగిస్తానని భరోసా ఇచ్చారు.

పిల్లల సంరక్షణ ఫ్రీ.. 

న్యూయార్క్‌లోని శ్రామిక కుటుంబాలకు అద్దె తర్వాత అతిపెద్ద ఖర్చు పిల్లల సంరక్షణే. అంటే..  న్యూయార్క్ సిటీలో తల్లి దండ్రులు ఇద్దరూ ఉద్యోగానికి వెళితే పిల్లలను డే కేర్ సెంటర్‎లో వేస్తారు. ఇందుకు భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా కుటుంబాలకు ఆర్ధిక భారంగా మారింది. దీంతో న్యూయార్క్‎లోని 6 వారాల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత పిల్లల సంరక్షణను అమలు చేస్తానని మమ్దానీ వాగ్ధానం చేశాడు. 

ప్రభుత్వం ఆధ్వర్యంలో కిరాణా షాపులు

ప్రపంచవ్యాప్తంగా నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా న్యూయార్క్ వాసులలో దాదాపు 9, 10 మందిలో కిరాణా సామాగ్రి ధరలు తమ ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కిరాణా దుకాణాలను న్యూయార్క్ ప్రభుత్వం ఆధీనంలో నడుపుతామని హామీ ఇచ్చారు. తద్వారా కిరాణా సరుకుల ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తుందని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా కిరాణా సరుకుల ధరలు అదుపులో ఉండి.. ప్రజలకు డబ్బు ఆదా అవుతోందని ప్రచారంలో మమ్దానీ ప్రధానంగా పేర్కొన్నారు.