JATADHARA Release Trailer: ధన పిశాచిపై సుధీర్ బాబు విశ్వరూపం.. అంచనాలు పెంచిన ‘జటాధర’ కొత్త ట్రైలర్

JATADHARA Release Trailer: ధన పిశాచిపై సుధీర్ బాబు విశ్వరూపం.. అంచనాలు పెంచిన ‘జటాధర’ కొత్త ట్రైలర్

సుధీర్ బాబు హీరోగా సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రల్లో నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌‌‌‌, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మించారు. ఈ మూవీ వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ థియేటర్లలో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ధన పిశాచి అనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ విజువల్స్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఇప్పటికే, సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందులో భాగంగానే రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసి జటాధరపై మరింత ఆసక్తి పెంచేశారు మేకర్స్.

మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి ‍అనే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. దేవుళ్లను నమ్మని ఒక నాస్తిక యువకుడు, ధన పిశాచి మధ్య జరిగే యుద్ధంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. శిల్పా శిరోద్కర్, సోనాక్షి సిన్హా పాత్రలు పవర్ ఫుల్గా ఉన్నాయి. వీరి మధ్య వచ్చిన సీన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అలాగే, సోనాక్షి సిన్హా (ధన పిశాచికు) ధీటైన పాత్రలో సుధీర్ బాబు విశ్వరూపం చూపించారు.

ఈ మూవీలో ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుబ్బలేఖ సుధాకర్ వంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. సమీర్ కల్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రాజీవ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.