చాలా మందికి హెలికాప్టర్ ఎక్కాలని కలగంటారు. కొందరు దాన్ని నిజం చేసుకుంటే మరికొందరు మాత్రం ఆ కలతోనే సంతృప్తి చెందాల్సిన పరిస్థితి ఉంటుంది. డబ్బున్న వారైతే అలాంటి హెలికాప్టర్లు ఎన్నైనా కొనుక్కోవచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్ కి అది అందని ద్రాక్షే. కానీ ఓ వ్యక్తి మాత్రం రోజూ హెలికాప్టర్ లో విహరించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మామాూలుగా విమాన ప్రయాణం అంటే వేలల్లో ఉంటుంది. అలాంటి రోజూ తిరిగే అదృష్టాన్ని పొందాడంటే అతను బాగా డబ్బున్న వ్యక్తి అని మోసపోకండి. అలా అని అతనేం గొప్ప పదవులున్న వ్యక్తి కూడా కాదు. అయినా ఈ అవకాశం అతనికి ఎలా దక్కింది. అంతే కాదు ఈ విమానం తయారీకి కేవలం రూ.2లక్షలే అయిందట. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించే ఈ వింత ఘటన ముజఫర్‌పూర్‌లో జరిగింది. అసలేమైంది, దీని వెనక ఉన్న నిజం ఏంటన్న విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా పెళ్లి అనగానే పెళ్లి కొడుకు బాగా అలంకరించిన కారులోనే.. లేదంటే ఇంకేదైనా కొత్త ఊరేగింపుతో రావడం చూస్తూనే ఉంటాం. కానీ ఔరాయ్ కు చెందిన అభిషేక్ రంజన్ మాత్రం హెలికాప్టర్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ వింత ఘటన కేవలం కలలోనే సాధ్యమవుతుందేమో. కానీ అభిషేక్ ఆ కలను నిజం చేసుకున్నాడు. అది కూడా తక్కువ ధరకే. అతనికి ఈ ప్రత్యేక హెలికాప్టర్‌లో రావడానికి అయిన ఖర్చు కేవలం రూ.7 నుంచి 10వేలు మాత్రమే. లక్షల రూపాయలు ఖరీదు చేసే ఈ హెలికాప్టర్‌ను కేవలం రూ.7 నుంచి 10 వేలలో ఎలా దొరుకుతుందని ఆలోచిస్తున్నారా.. దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
హెలికాప్టర్‌తో కూడిన కారు..
నిజానికి, చంద్రభూషణ్‌కి చెందిన మారుతీ 800 కారు ఇప్పుడు హెలికాప్టర్‌లా ఉందని ముజఫర్‌పూర్‌లోని ఔరాయ్ బ్లాక్‌కు చెందిన సహిలా బైజ్‌నాథ్ నివాసి చంద్రభూషణ్ రాయ్ చూపించారు. ఈ కారులో ఫ్యాన్ కూడా ఉంది. అచ్చం హెలికాప్టర్ రూపాన్ని కలిగి ఉన్న ఈ కారు... ఆకాశంలో ఎగరడానికి బదులు రోడ్డు మీద నడుస్తోంది. ఇక ఈ ప్రత్యేక హెలికాప్టర్‌ను ఎవరైనా తక్కువ ధరకు అద్దెకు కూడా ఇవ్వడం మరో ప్రత్యేకత. చంద్రభూషణ్‌కు చెందిన ఈ హెలికాప్టర్ కారును చూసేందుకు ప్రతిరోజూ జనం తరలివస్తున్నారు. ఈ హెలికాప్టర్ కారు రోడ్డుపై కదులుతున్నప్పుడు, ఈ కారును చూసేందుకు జనం పోటెత్తారని చంద్రభూషణ్ చెప్పారు.
2 లక్షలు వెచ్చించి..
హెలికాప్టర్ ను పోలిన కారు వీడియోను తాను యూట్యూబ్‌లో చూశానని చంద్రభూషణ్ రాయ్ చెప్పారు. ఇంతకు ముందు అతని వద్ద మారుతీ 800 ఉండేదన్న ఆయన.. యూట్యూబ్‌లో ఈ కారును చూసి, తన కారుకు కూడా హెలికాప్టర్ లుక్ ఎందుకు ఇవ్వకూడదని అనుకున్నాడు. ఆ తర్వాత, సివాన్‌లోని గ్యారేజీలో రూ.2లక్షలు వెచ్చించి తన మారుతి 800 కారును హెలికాప్టర్‌గా మార్చారు. ఇప్పుడు అతని కారు సేమ్ టూ సేమ్ హెలికాప్టర్ లాగా ఉంది. దీని రెక్కలు కూడా హెలికాప్టర్ లాగా తిరుగుతాయి. రంగురంగుల లైట్లతో కూడిన ఈ కారు చూసేవారి కళ్లను ఆకట్టుకుంటోంది.
ఒకరోజు బుకింగ్ రూ. 7 నుంచి 10 వేల వరకు..
ఇప్పుడు తాను ఈ కారుతో సంపాదన ప్రారంభించానని చంద్రభూషణ్ చెప్పారు. ఈ కారు పెళ్లి ఊరేగింపుల కోసం బుక్ చేసుకుంటారని, వివాహ కారు బుకింగ్ మొత్తం రోజుకు రూ.7,000 నుండి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఎక్కువ డిమాండ్ ఉంటే రూ.10 వేలకు కూడా బుకింగ్ చేసుకుంటారని చంద్రభూషణ్ స్పష్టం చేశారు. కారు కొత్త లుక్ కారణంగా, చాలా మంది ఈ హెలికాప్టర్ కారు బుక్ చేసుకోవడానికి తన వద్దకు వస్తుంటారని ఆయన చెప్పారు.