ఏఐ వాడుతున్న బైజూస్..టీచర్లకు ప్రత్యామ్నాయం కాదంటున్న దివ్య గోకుల్‌‌నాథ్​

ఏఐ వాడుతున్న బైజూస్..టీచర్లకు ప్రత్యామ్నాయం కాదంటున్న దివ్య గోకుల్‌‌నాథ్​

న్యూఢిల్లీ: స్టూడెంట్స్​ లెర్నింగ్​ మాడ్యూల్స్​లో జెనరేటివ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ​అందుబాటులోకి తెచ్చినట్లు  బైజూస్​ ప్రకటించింది. టెక్నాలజీ టీచర్లకు ప్రత్యామ్నాయం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బైజూస్​ విజ్​ సూట్​ – బద్రి, మ్యాథ్​ జీపీటీ, టీచర్ ​జీపీటీల పేరుతో మూడు ఏఐ మోడల్స్​ను బైజూస్​ పరిచయం చేసింది. స్టూడెంట్లు ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ ఏఐ మోడల్స్​ సాయపడతాయని, దాని ఆధారంగా వారి లెర్నింగ్​ ప్రాసెస్​ మరింత మెరుగుపడేలా తాము ప్రయత్నించడానికి వీలవుతుందని బైజూస్​ పేర్కొంది. టీచర్లను పక్కకు పెట్టే ఉద్దేశంతో ఏఐ తేవడం లేదని, ఆర్గనైజేషన్​లో ఎఫిషియన్సీ పెంచడం కోసమేనని బైజూస్​ కో–ఫౌండర్​ దివ్య గోకుల్​నాథ్​ వెల్లడించారు. మరింత విలువైన అంశాలపై టీచర్లు ఫోకస్​ పెట్టడానికి ఇది అవకాశం కల్పిస్తుందని వివరించారు. టీచర్లకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని పేర్కొన్నారు. ఏఐ మాడ్యూల్​ తేవడం వల్ల కంపెనీ రెవెన్యూ, మార్జిన్లు మెరుగుపడతాయని చెప్పారు. టీచర్లు మరింత బెటర్​ టీచర్లుగా మారేందుకు ఏఐ ని వాడుకోవచ్చని అన్నారు.