బైజూస్‌‌‌‌ యూఎస్‌‌‌‌ సబ్సిడరీ కోర్టు చేతిలో

బైజూస్‌‌‌‌ యూఎస్‌‌‌‌ సబ్సిడరీ కోర్టు చేతిలో

న్యూఢిల్లీ :  యూఎస్ సబ్సిడరీ దగ్గర ఉన్న 533 మిలియన్ డాలర్ల ఫండ్స్‌‌‌‌ను  ఫ్రీజ్ చేయాలని  అక్కడి బ్యాంకరప్టసీ  కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బైజూస్ స్పందించింది. లెండర్లను కాపాడేందుకు యూఎస్  డెలవేర్ కోర్ట్‌‌‌‌ ఈ తీర్పిచ్చింది. ప్రస్తుతం ఈ ఫండ్స్‌‌‌‌ కోర్టు ఆధీనంలో ఉన్నాయి. స్టేటస్ క్యూ మెయింటైన్ చేయడానికే కోర్టు ఈ తీర్పిచ్చిందని బైజూస్ పేర్కొంది. తమ సబ్సిడరీ దగ్గర ఈ ఫండ్స్‌‌‌‌ను ఉంచామని, కోర్టు ఆదేశం మేరకు ఈ ఫండ్స్ అక్కడే ఉంటాయని తెలిపింది. కేసు వేసిన లెండర్లకు ఎటువంటి రిలీఫ్‌‌‌‌ను కోర్టు ఇవ్వలేదని  పేర్కొంది. కాగా, బైజూస్ (పేరెంట్‌‌‌‌ కంపెనీ  థింక్ అండ్ లెర్న్‌‌‌‌) యూఎస్‌‌‌‌ సబ్సిడరీ బైజూస్‌‌‌‌ ఆల్ఫా కంట్రోల్‌‌‌‌ను లెండర్లు ఇప్పటికే సీజ్ చేశారు. ప్రస్తుతం ఇది  యూఎస్ జడ్జి ఆధీనంలో ఉంది. లెండర్లకు బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉంది. కొన్ని సంస్థలు కలిసి పరిస్థితులను వరెస్ట్‌‌‌‌గా మారుస్తున్నాయని బైజూస్ ఆరోపించింది.