
హైదరాబాద్, వెలుగు: దేశంలో న్యూట్రీషియన్ రీసెర్చ్‌కు పితామహుడిగా పేరొందిన డాక్టర్ కొలుత్తూ ర్గోపాలన్(101) గురువారం చెన్నైలో కన్నుమూశారు. జీవింతంలో ఏడుదశాబ్దాల పాటు రీసెర్చ్‌కే అంకితమైనఆయన 1961 నుంచి 1974 వరకుహైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్‌ఐఎన్ ) డైరెక్టర్‌గా పనిచేశారు. 1974 నుంచి 79 వరకుఆయన న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. దేశానికి అందించిన సేవలకుగాను ప్రభుత్వం ఆయన్ను 1970లో పద్మశ్రీతో, 2003లో పద్మభూషణ్ తో సత్కరించింది. ఆయన పరిశోధనలు ప్రజల్లో పోషకార లోపాలు నివారించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడ్డా యి. దేశంలో 1970 ల్లో ఐసీడీఎస్ పోషకాహార ప్రోగ్రామ్స్ ప్రారంభించడంలోనూ ఆయన కృషి ఉంది.