హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్యాక్సీలో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్జీఐఏ ఎయిర్‌పోర్టు పోలీసుల కథనం ప్రకారం..నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మహిళ(38) జడ్చర్లలో కిరాణా షాపు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 26న సాయంత్రం జడ్చర్లలో ట్యాక్సీ ఎక్కి హైదరాబాద్ బయలుదేరింది.
శంషాబాద్‌కు చేరుకున్నాక గచ్చిబౌలి వెళ్లేందుకు అదనంగా డ్రైవర్ రూ. 50 అడగ్గా ఇచ్చేందుకు అంగీకరించింది. తర్వాత తుండుపల్లి టోల్‌గేట్ దాటి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులోకి వెళ్లాక, ఓ మెడికల్ షాప్ వద్ద డ్రైవర్ మందుల కోసం కారు ఆపాడు.
తర్వాత రాత్రి 8:30 గంటల సమయంలో కొత్వాల్‌గూడ సర్వీస్ రోడ్డులోకి కారును తీసుకుపోయాడు. అక్కడ ఆపి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ ఆమె దగ్గరున్న రూ. 60 వేల నగదు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
