మోడీ అధ్యక్షతన కేబినేట్‌ మీటింగ్: కీలక నిర్ణయాలు

మోడీ అధ్యక్షతన కేబినేట్‌ మీటింగ్: కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (గురువారం) కేంద్ర కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ECHS సేవలను వర్తింపచేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వారితో పాటు ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్లు, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లు, ప్రీమెచ్యూర్ రిటైరీస్ కు కూడా ECHS వర్తింప చేయనున్నారు. ఢిల్లీ మెట్రో  ఫోర్త్ ఫేజ్ కు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇబ్బందుల్లో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులపై హైలెవల్ ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. అలాగే సివిల్, డిఫెన్స్ రంగాలకు సంబంధించి 50 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. ఇందులో రెండు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. గుంటూరు జిల్లాలో నాదెండ్ల మండలంలో ఒకటి, ప్రకాశం జిల్లా కందుకూరులో మరోటి ఏర్పాటు చేయనున్నారు.

బీహార్ లోని  బక్సర్ లో 1320 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో నిర్మించనున్న ఖుర్జా సూపర్ పవర్ ప్లాంట్ కు కూడా అనుమతులిచ్చింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లోని… టీచర్స్ క్యాడర్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్డినెన్స్ ప్రకారం…డిపార్ట్ మెంట్ లేదా సబ్జెక్ట్ యూనిట్ గా కాకుండా… యూనివర్సిటీ లేదంటే కాలేజ్ లను యూనిట్ గా పరిగణిస్తారు. రాష్ట్రాల్లోని ఎయిర్ స్ట్రిప్స్ ను అభివృద్ధి చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బడ్జెట్ లో 4500 కోట్లు కేటాయించారు. జమ్మూకశ్మీర్ లోని కీరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కు కేబినెట్ అనుమతులు ఇచ్చింది. ముంబై అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ మరో దశకు కేబినెట్ అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 33వేల 690 కోట్లుగా అంచనా వేశారు. చక్కెర మిల్లులకు అదనంగా రూ.2,790 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇండియా-భూటాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 3 సవరణకు కేబినెట్ అనుమతి తెలిపింద. మాండెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం ఆర్టికల్ ను సవరించనున్నారు. ఢిల్లీలోని అనాథరైజ్డ్ కాలనీల్లో ఓనర్ షిన్, ట్రాన్స్ ఫర్, మోర్టాజ్ హక్కులపై కమిటీ ఏర్పాటు చేసింది కేబినెట్. టెక్స్ టైల్స్ రంగానికి ఊతమిచ్చేలా… కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పన్నులను రిబేట్ ఇచ్చేందుకు కేబినెట్ అనుమతించింది. జల విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించే చర్యలకు కేంద్రమంత్రివర్గం అంగీకారం తెలిపింది.