తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ: కేబినెట్ నిర్ణయం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ: కేబినెట్ నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది.సచివాలయంలో మే 20న మూడు గంటలకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.  జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియగాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది.  అలాగే, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు నష్టం జరగకుండా చివరిగింజ వరకు కొనాలని ఆదేశించింది.

 కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. అత్యవసర అంశాలపైనే కేబినెట్ చర్చింది.  రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత మరోసారి మంత్రివర్గం చర్చించనుంది.